సరిలేరు నీకెవ్వరు… ఇప్పుడు విజయశాంతి వంతు…

సరిలేరు నీకెవ్వరు..  అనిల్ రావిపూడి దర్శకుడిగా, మహేష్ బాబు హీరో గా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈ సినిమా ఇంట్రో టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా యూనిట్ ఎంతో సంతోషం గా ఉంది. అయితే ఈ సినిమా కి సంబందించిన ఒక ముఖ్యమైన సీక్వెన్స్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలవనుంది.

ఈ రోజు నుంచి లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుందని చెబుతున్నారు. మహేష్ బాబు తో కలిసి విజయశాంతి ఈ సీన్ల లో నటిస్తుందట. ఈ సినిమా లో విజయశాంతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఎప్పటి నుంచో విజయశాంతి తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న అనిల్ కి… మొత్తానికి ఈ సినిమాతో అది నెరవేరింది. ఈ సినిమా తో విజయ శాంతి తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు.