Telugu Global
NEWS

కెనడా టోర్నీలో యువరాజ్ సింగ్ అండ్ కో నిరసన

గ్లోబల్ టీ-20లో జీతాలు చెల్లించలేదంటూ ఆందోళన కెనడా వేదికగా తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ టీ-20 క్రికెట్ లీగ్ టోర్నీముగియక ముందే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో సహా వివిధ దేశాల క్రికెటర్ల నిరసన చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని బ్రాంప్టన్ స్టేడియం వేదికగా యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టొరాంటో నేషనల్స్, మాంట్రియెల్ టైగర్స్ జట్ల మధ్య జరగాల్సిన టీ-20 మ్యాచ్..రెండుజట్ల ఆటగాళ్ల నిరసనతో రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. తమతో కాంట్రాక్టు కుదుర్చుకొన్న ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని..తమకు చెల్లించాల్సిన […]

కెనడా టోర్నీలో యువరాజ్ సింగ్ అండ్ కో నిరసన
X
  • గ్లోబల్ టీ-20లో జీతాలు చెల్లించలేదంటూ ఆందోళన

కెనడా వేదికగా తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ టీ-20 క్రికెట్ లీగ్ టోర్నీముగియక ముందే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో సహా వివిధ దేశాల క్రికెటర్ల నిరసన చర్చనీయాంశంగా మారింది.

కెనడాలోని బ్రాంప్టన్ స్టేడియం వేదికగా యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టొరాంటో నేషనల్స్, మాంట్రియెల్ టైగర్స్ జట్ల మధ్య జరగాల్సిన టీ-20 మ్యాచ్..రెండుజట్ల ఆటగాళ్ల నిరసనతో రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది.

తమతో కాంట్రాక్టు కుదుర్చుకొన్న ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని..తమకు చెల్లించాల్సిన వేతనాల గురించి ఏమాత్రం పట్టించుకోడం లేదంటూ ఆటగాళ్లు నిరసన తెలుపుతూ ఆటకు దూరంగా ఉంటూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  9 Aug 2019 11:06 PM GMT
Next Story