Telugu Global
NEWS

బాబుతో మాట్లాడి చెబుతా....

టీడీపీ వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన బోండాను… టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై చర్చించారు. బోండా ఉమా బీజేపీలోకి గానీ, వైసీపీలోకి గానీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో నియోజకవర్గ బాధ్యతల విషయంలో సమీకరణలు సెట్‌ అవలేదంటున్నారు. ఈ నేపథ్యంలో బోండా ఉమా విదేశాల నుంచి విజయవాడరాగానే బుద్దా వెంకన్న కలిశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమా వద్దకు […]

బాబుతో మాట్లాడి చెబుతా....
X

టీడీపీ వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన బోండాను… టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై చర్చించారు.

బోండా ఉమా బీజేపీలోకి గానీ, వైసీపీలోకి గానీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో నియోజకవర్గ బాధ్యతల విషయంలో సమీకరణలు సెట్‌ అవలేదంటున్నారు.

ఈ నేపథ్యంలో బోండా ఉమా విదేశాల నుంచి విజయవాడరాగానే బుద్దా వెంకన్న కలిశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమా వద్దకు వెంకన్న వెళ్లారు. వైసీపీలోకి వెళ్లవద్దని… అలా చేస్తే భవిష్యత్తు దెబ్బతింటుందని బోండాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట బుద్దా వెంకన్న.

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన బోండా ఉమా ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నానన్నారు. తాను ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని… చంద్రబాబుతో సోమవారం సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.

First Published:  10 Aug 2019 9:40 PM GMT
Next Story