16 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్నారు

హీరో గోపీచంద్, దర్శకుడు తేజ… వీళ్లిద్దరూ కలిసి గతంలో జయం అనే సినిమా చేశారు. ఆ సినిమాలో గోపీచంద్ విలన్ గా కనిపించాడు. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గోపీచంద్ ను డైరక్ట్ చేయబోతున్నాడు దర్శకుడు తేజ. అయితే ఈసారి తేజ సినిమాలో గోపీచంద్ విలన్ కాదు, హీరోగానే కనిపించబోతున్నాడు.

తాజాగా వీళ్లిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న చాణక్య సినిమా తర్వాత ఈ మూవీనే సెట్స్ పైకి వచ్చే చాన్స్ ఉంది. అంతేకాదు, ఈ సినిమాను కూడా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించనున్నాడు.

అయితే ప్రస్తుతం తేజ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. చాన్నాళ్లుగా హీరోయిన్ కాజల్ తో చర్చలు జరుపుతున్నాడు ఈ దర్శకుడు. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమానే సెట్స్ పైకి వెళ్తుంది.

మరి తేజ… కాజల్ వైపు మొగ్గుచూపుతాడా లేక గోపీచంద్ సినిమాను స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.

అటు కాజల్, దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా చర్చలు జరుపుతోంది. ఆ ప్రాజెక్టు ఓకే అయితే, తేజ-గోపీచంద్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే.