కన్నడ రీమేక్ లో రాజశేఖర్

కల్కి సినిమా రాజశేఖర్ ను మరోసారి ఆలోచనలో పడేసింది. గరుడవేగ సక్సెస్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఈ హీరో. దీంతో ఇప్పుడు మళ్లీ ఇంకో హిట్ కొట్టాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇక్కడే ఓ రీమేక్ ను నమ్ముకున్నాడు ఈ సీనియర్ హీరో. దర్శకులు చెప్పే కథలు కంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం బెటరని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ కన్నడ హిట్ సినిమాపై కన్నేశాడు రాజశేఖర్.

రీసెంట్ గా కన్నడలో హిట్ అయిన ఓ సినిమాను రాజశేఖర్ రీమేక్ చేయబోతున్నాడు. కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ ధనుంజయ ఈ సినిమాను రాజశేఖర్ హీరోగా నిర్మించబోతున్నాడు. అయితే ఇది కేవలం తెలుగు రీమేక్ మాత్రమే కాదు. సైమల్టేనియస్ గా తమిళ్ లో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. తెలుగులో రాజశేఖర్ పోషించనున్న ఆ పాత్రను తమిళ్ లో సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ పోషించబోతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ, రాజశేఖర్ రీమేక్ చేయబోతున్న ఆ కన్నడ సినిమా ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే ప్రకటించడం రాజశేఖర్ స్టయిల్. అందుకే ఈ రీమేక్ ను కూడా సస్పెన్స్ లో ఉంచారు. అంతేకాదు, తెలుగులో ఓ మంచి టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రకటించాలనేది మేకర్స్ ఆలోచన. ప్రస్తుతానికైతే రాజశేఖర్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. కొత్త సినిమాను ఇప్పట్లో ప్రకటించే మూడ్ లో లేడు.