Telugu Global
NEWS

బి.ఆర్.కె భవన్ నుంచి పాలన ఎప్పుడు?

తెలంగాణ పాలన బి.ఆర్.కె.భవన్ కు తరలించడం దాదాపు పూర్తయినట్లే అని అధికార్లు అంటున్నారు. శ్రావణ శుక్రవారం రోజున ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి తన కార్యాలయంలో పనులు నిర్వహించడం ప్రారంభించారు. అట్లాగే జి.ఎ.డి, ప్రోటోకాల్ అధికార్లు కూడా బి.ఆర్.కె భవన్ కి రెండు రోజుల్లో రాబోతున్నారు. బి.ఆర్.కె లోని సచివాలయంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలన్న కేసీఆర్ ఆకాంక్షను తీర్చేందుకు అధికారులు చాలా కష్టపడి శాఖలను తరలించే పనిని పూర్తి చేస్తున్నారు. ఇక బడ్జెట్ […]

బి.ఆర్.కె భవన్ నుంచి పాలన ఎప్పుడు?
X

తెలంగాణ పాలన బి.ఆర్.కె.భవన్ కు తరలించడం దాదాపు పూర్తయినట్లే అని అధికార్లు అంటున్నారు. శ్రావణ శుక్రవారం రోజున ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి తన కార్యాలయంలో పనులు నిర్వహించడం ప్రారంభించారు.

అట్లాగే జి.ఎ.డి, ప్రోటోకాల్ అధికార్లు కూడా బి.ఆర్.కె భవన్ కి రెండు రోజుల్లో రాబోతున్నారు. బి.ఆర్.కె లోని సచివాలయంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలన్న కేసీఆర్ ఆకాంక్షను తీర్చేందుకు అధికారులు చాలా కష్టపడి శాఖలను తరలించే పనిని పూర్తి చేస్తున్నారు.

ఇక బడ్జెట్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్న ఆర్థిక శాఖ రెండు రోజుల్లో బి.ఆర్.కె కి తరలిపోనున్నది… అయితే ఇప్పటికే చాలా శాఖలు బి.ఆర్.కె కి పోయినట్లేనని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కార్యాలయాల ఆధునికీకరణ, వసతుల కల్పన వంటి పనులు సాగుతున్నందువల్ల రెండు మూడు రోజుల్లో ప్రతిపాదిత కార్యాలయాల తరలింపు పూర్తికానుంది.

తొమ్మిది అంతస్తుల ఈ భవనంలో…. మంత్రులందరికీ కార్యాలయాలతో పాటు కీలక శాఖల కార్యాలయాలు కూడా ఉంటాయి. పార్కింగ్ సౌకర్యం కోసం జిహెచ్ఎంసి నుంచి బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ సిజిఎం కార్యాలయం వరకు ఉన్న రోడ్డును మూసివేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత బి.ఆర్.కె నుంచి పాలన సజావుగా నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నా…. అది అంత సులువైన పని కాదు అని అంటున్నారు కొందరు అధికారులు.

క్లిష్టమైన బిజినెస్ రూల్స్, రొటీన్ ఫైల్స్, వాటిని భద్రపరిచే బీరువాలు, వస్తు సామగ్రిని సమకూర్చుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అంటున్నారు. వీటన్నింటినీ భద్రపరచడానికి సరిపోయే స్థలం కూడా లేదని అధికారులు అనుకుంటున్నారు. మరో ఆరు నెలల వరకు పరిపాలన గాడిలొ పడటం కష్టమే నని చెబుతున్నారు.

First Published:  11 Aug 2019 3:54 AM GMT
Next Story