Telugu Global
CRIME

ప్యారాచూట్ తెరుచుకోలేదు.... డాక్టర్ ప్రాణం పోయింది

విహార యాత్ర విషాద యాత్రగా మారింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ప్యారాచూట్ ప్రయాణమే ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తేపల్లికి చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ చంద్రశేఖర రెడ్డి హైదరాబాద్ లోని నాగోలులో స్దిరపడ్డారు. చిన్నతనం నుంచి విహారయాత్రలపై ఎంతో ఇష్టం పెంచుకున్న డాక్టర్ చంద్రశేఖర్ కల తీరిందని ఎంతో ఆనందించాడు. తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు కులుమానాలి వెళ్లారు. అక్కడి అడ్వంచర్ క్లబ్ లో పారాగ్లైడింగ్ చేస్తుండగా […]

ప్యారాచూట్ తెరుచుకోలేదు.... డాక్టర్ ప్రాణం పోయింది
X

విహార యాత్ర విషాద యాత్రగా మారింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ప్యారాచూట్ ప్రయాణమే ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తేపల్లికి చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ చంద్రశేఖర రెడ్డి హైదరాబాద్ లోని నాగోలులో స్దిరపడ్డారు.

చిన్నతనం నుంచి విహారయాత్రలపై ఎంతో ఇష్టం పెంచుకున్న డాక్టర్ చంద్రశేఖర్ కల తీరిందని ఎంతో ఆనందించాడు. తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు కులుమానాలి వెళ్లారు. అక్కడి అడ్వంచర్ క్లబ్ లో పారాగ్లైడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో చంద్రశేఖర రెడ్డి ప్రాణాలు కోల్లోయారు.

హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చంద్రశేఖర రెడ్డి ఫ్రీలాన్స్ ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి ఆయన కులుమనాలి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన చంద్రశేఖర రెడ్డి పుట్టిన రోజు ఆ వేడుకలను కులుమనాలిలో జరుపుకుని వస్తానంటూ ఇంట్లో చెప్పారు. కులుమనాలి చేరుకున్న చంద్రశేఖర రెడ్డి అక్కడి ఓ అడ్వంచర్ క్లబ్ లో పారాగ్లైడింగ్ చేసేందుకు ఓ ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. అక్కడ నుంచి క్రిందికి దూకే క్రమంలో ఆయన నడుముకు ఉన్న ప్రారాచూట్ తెరుచుకోలేదు.

దీంతో అంత ఎత్తునుంచి నేలమీద పడి తీవ్ర గాయాలతో అక్కడక్కడికే మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే స్వగ్రామం కొత్తేపల్లిలోను, ఆయన పనిచేస్తున్న ఈసీఐఎల్ లోని ఆసుపత్రిలోను, ఆయన నివాసం ఉంటున్న నాగోలు లోను విషాదఛాయలు అలుమకున్నాయి.

మరోవైపు కులుమనాలిలో పారాగ్లైడింగ్, హ్యాండ్ గ్లైడింగ్ వంటి కార్యక్రమాలపై జూలై 15 నుంచి నిషేధం అమలులో ఉందని స్దానిక పోలీసులు పేర్కొన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించి అడ్వంచర్ క్లబ్ లో పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్న యజమానిపై చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసులు చెప్పారు. చంద్రశేఖర రెడ్డి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్దానిక ఆసుపత్రికి తరలించారు.

First Published:  10 Aug 2019 9:24 PM GMT
Next Story