సాయిపల్లవి నుంచి మరో మూవీ….

ఫిదా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది సాయిపల్లవి. అటు రష్మికకు క్రేజ్ పెరగడంతో ఈమె పాపులారిటీ తగ్గింది. వరుసగా దూసుకొచ్చిన డబ్బింగ్ సినిమాలు కూడా సాయిపల్లవి ఇమేజ్ ను దెబ్బతీశాయి. తమిళ, మలయాళంలో సాయిపల్లవి నటించిన సినిమాలన్నింటినీ తెలుగులోకి డబ్ చేసి ఆమె పాపులారిటీని పూర్తిగా చెడగొట్టేశారు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం జరుగుతోంది. సాయిపల్లవి గతంలో నటించిన ఓ మళయాళం సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు.

సాయిపల్లవితో పాటు ఫహాద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాకు తెలుగులో అనుకోని అతిథి అనే టైటిల్ పెట్టారు. నిజానికి మలయాళంలోనే ఇదొక పెద్ద డిజాస్టర్. అప్పటివరకు సాయిపల్లవికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ మొత్తం ఈ ఒక్క సినిమా దెబ్బతో పోయింది. ఇందులో ఆమె యాక్టింగ్, చేసిన ఫైట్స్ కు ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు.

అలాంటి సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సాయిపల్లవి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా ఆమె ఇమేజ్ ను మరింత దెబ్బతీయడం ఖాయం. పాపం, ఈ విషయంలో సాయిపల్లవి కూడా ఏమీ చేయలేదు. డబ్బింగ్ రైట్స్ అనేది నిర్మాతల వ్యవహారం కదా. రష్మికకు ఈ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు తక్కువే. పైగా ఇటు తెలుగులో ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. సాయిపల్లవిని స్టార్ హీరోలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.