Telugu Global
National

సోనియాగాంధీ మ‌ళ్లీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు !

యువ నాయ‌క‌త్వం అన్నారు. యువ‌త‌కు పెద్ద‌పీట అన్నారు. సీనియ‌ర్ల‌కు సెల‌వు చెబుతామ‌ని అన్నారు. పార్టీకి కొత్త ర‌క్తం ఎక్కిస్తామ‌ని చెప్పారు. తీరా చూస్తే మ‌ళ్లీ గాంధీ కుటుంబం శ‌ర‌ణు కోరారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్‌గాంధీ నెల‌రోజుల కింద‌ట రాజీనామా చేశారు. తిరిగి కాంగ్రెస్ అధ్య‌క్షున్ని ఎన్నుకునేందుకు సీడ‌బ్ల్యూసీ స‌మావేశమైంది. సుదీర్ఘ మంత‌నాల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని మరోసారి ఎంపిక చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు […]

సోనియాగాంధీ మ‌ళ్లీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు !
X

యువ నాయ‌క‌త్వం అన్నారు. యువ‌త‌కు పెద్ద‌పీట అన్నారు. సీనియ‌ర్ల‌కు సెల‌వు చెబుతామ‌ని అన్నారు. పార్టీకి కొత్త ర‌క్తం ఎక్కిస్తామ‌ని చెప్పారు. తీరా చూస్తే మ‌ళ్లీ గాంధీ కుటుంబం శ‌ర‌ణు కోరారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్‌గాంధీ నెల‌రోజుల కింద‌ట రాజీనామా చేశారు. తిరిగి కాంగ్రెస్ అధ్య‌క్షున్ని ఎన్నుకునేందుకు సీడ‌బ్ల్యూసీ స‌మావేశమైంది. సుదీర్ఘ మంత‌నాల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని మరోసారి ఎంపిక చేశారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో నేతలంతా కలిసి సోనియాగాంధీని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రకటించారు. సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.

పార్టీ క‌ష్టకాలంలో ఉంది. బీజేపీని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనే నేత కావాలి. చాలా ఆప్ష‌న్లు పరిశీలించారు. కానీ కాంగ్రెస్ మ‌ళ్లీ చీలిపోకుండా ఉండాలంటే గాంధీ కుటుంబం అవ‌స‌రాన్నిగుర్తించిన నేత‌లు రాహుల్ ను అధ్య‌క్షునిగా కొన‌సాగాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. కానీ రాహుల్ ఒప్పుకోక‌పోవ‌డంతో సోనియాని తిరిగి ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కోరారు. దీంతో ఆమె మ‌ళ్లీ అధ్య‌క్షురాలిగా కొన‌సాగేందుకు ఒప్పుకున్నార‌ని తెలిసింది.

First Published:  10 Aug 2019 8:22 PM GMT
Next Story