Telugu Global
NEWS

భారత్-విండీస్ వన్డే సిరీస్ లో సూపర్ సండే ఫైట్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో నేడే కీలకసమరం రాత్రి 7 గంటల నుంచి హోరాహోరీపోరు ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో…గయానా లోని ప్రావిడెన్స్ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ – ఆఫ్-స్పెయిన్ కు చేరింది. జార్జిటౌన్ లో జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోడంతో..ఈ రెండోవన్డే సిరీస్ కే కీలకంగా మారింది. రెండోవన్డేలో నెగ్గినజట్టుకే.. సిరీస్ సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నంబర్ -4 స్థానంలో శ్రేయస్ […]

భారత్-విండీస్ వన్డే సిరీస్ లో సూపర్ సండే ఫైట్
X
  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో నేడే కీలకసమరం
  • రాత్రి 7 గంటల నుంచి హోరాహోరీపోరు

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో…గయానా లోని ప్రావిడెన్స్ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ – ఆఫ్-స్పెయిన్ కు చేరింది.

జార్జిటౌన్ లో జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోడంతో..ఈ రెండోవన్డే సిరీస్ కే కీలకంగా మారింది. రెండోవన్డేలో నెగ్గినజట్టుకే.. సిరీస్ సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నంబర్ -4 స్థానంలో శ్రేయస్ అయ్యర్

ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కొహ్లీ ,తాజా నంబర్ ఫోర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ తమతమ బ్యాట్లకు పూర్తిస్థాయిలో పని చెప్పడానికి ఉరకలేస్తున్నారు.

ఇక…ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి విండీస్ ప్రత్యర్థిగా ఇప్పటికే అత్యధికంగా ఏడు సెంచరీలు బాదిన అరుదైన రికార్డు ఉంది. అంతేకాదు.. కొహ్లీ మరో 19 పరుగులు సాధించగలిగితే…విండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలువగలుగుతాడు.

విండీస్ పై 64 మ్యాచ్ ల్లో 1930 పరుగులు సాధించిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ పేరుతో ఉంది. ఆ రికార్డును కొహ్లీ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సొంతగడ్డపై విండీస్ దే జోరు…

కరీబియన్ గడ్డపై ఈ రెండుజట్లూ 37 వన్డేల్లో తలపడితే…విండీస్ 20, భారత్ 14 విజయాల రికార్డుతో నిలిచాయి. మిగిలిన మూడువన్డేలు ఫలితం తేలకుండానే రద్దుల పద్దులో చేరాయి. భారత్ పై కరీబియన్ జట్టుకు 62 శాతం, విండీస్ ప్రత్యర్థిగా భారత్ కు 58 శాతం విజయాలు ఉన్నాయి.

ఓవరాల్ గా చూస్తే ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ ఈ రెండుజట్లు128 వన్డేల్లో ఫేస్ టు ఫేస్ తలపడితే…కరీబియన్ టీమ్ 62, భారత్ 60 విజయాల రికార్డుతో ఉన్నాయి.

క్రిస్ గేల్ వైపే విండీస్ చూపు..

గయానా వేదికగా ముగిసిన తొలివన్డేలో దారుణంగా విఫలమైన విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

ఈ సిరీస్ తోనే గేల్ వన్డే క్రికెట్ కు సైతం గుడ్ బై చెప్పనున్నాడు. కనీసం ప్రస్తుత సిరీస్ ఆఖరి రెండువన్డేలలోనైనా తన ట్రేడ్ మార్క్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో తన కెరియర్ ను ముగించాలన్న పట్టుదలతో గేల్ ఉన్నాడు.

రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెండోవన్డే ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగితే హోరాహోరీ పోటీతప్పదు.

First Published:  10 Aug 2019 9:00 PM GMT
Next Story