Telugu Global
NEWS

భారత క్రికెట్ బోర్డుతో ఐసీసీ కోల్డ్ వార్

భారత దేశవాళీ క్రికెట్ నియంత్రణకు ఐసీసీ స్కెచ్  ఐసీసీ ప్రతిపాదనను తిప్పికొట్టిన బీసీసీఐ బీసీసీఐ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీకి… ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు నడుమ కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. చివరకు భారత దేశవాళీ క్రికెట్ కార్యక్రమాలనే నియంత్రించడానికి, తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి పావులు కదుపుతోంది. భారత క్రికెట్ బోర్డు ఏటా నిర్వహించే రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ టోర్నీలతో పాటు ఐపీఎల్ ను […]

భారత క్రికెట్ బోర్డుతో ఐసీసీ కోల్డ్ వార్
X
  • భారత దేశవాళీ క్రికెట్ నియంత్రణకు ఐసీసీ స్కెచ్
  • ఐసీసీ ప్రతిపాదనను తిప్పికొట్టిన బీసీసీఐ

బీసీసీఐ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీకి… ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు నడుమ కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. చివరకు భారత దేశవాళీ క్రికెట్ కార్యక్రమాలనే నియంత్రించడానికి, తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి పావులు కదుపుతోంది.

భారత క్రికెట్ బోర్డు ఏటా నిర్వహించే రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ టోర్నీలతో పాటు ఐపీఎల్ ను సైతం తమ ఆమోదంతోనే నిర్వహించాలంటూ ఐసీసీ కోరటాన్ని…బీసీసీఐ తప్పుపట్టింది.

ఐసీసీ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదంటూ బీసీసీఐ తిప్పికొట్టింది. భారత దేశవాళీ టోర్నీల షెడ్యూలుతో ఐసీసీకి సంబంధం ఏమిటని బీసీసీఐ నిలదీసింది.

టెస్ట్ హోదా పొందిన దేశాలకు ఐసీసీ హుకుం…

టెస్ట్ హోదా పొందిన మొత్తం 10 దేశాల క్రికెట్ బోర్డులు తన చెప్పుచేతల్లో ఉండాలంటూ ఐసీసీ చెబుతోంది. వివిధ దేశాల దేశవాళీ క్రికెట్ టోర్నీలను.. తమ అనుమతితోనే నిర్వహించాలంటూ కోరింది.

అయితే…క్రికెట్ ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులతోపాటు బీసీసీఐ సైతం ఐసీసీ ప్రతిపాదనను గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి.

భారత క్రికెట్ బోర్డు తన సొంతసొమ్ముతో దేశవాళీ క్రికెట్ టోర్నీలు నిర్వహించుకొంటుంటే ఐసీసీ అనుమతి దేనికని బీసీసీఐ ప్రశ్నిస్తోంది.

భారత్ సొమ్ముతో ఐసీసీ షోకు….

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ భారత్. ఐసీసీ మొత్తం రాబడిలో 60 శాతం వరకూ భారత్ నుంచే అందుతోంది. అంతేకాదు..భారత్ కు అందాల్సిన వాటాను సైతం ఐసీసీ గణనీయంగా తగ్గించడం ద్వారా మిగిలిన దేశాలకు ఎక్కువభాగం పంచుతూ బీసీసీఐ సహనాన్ని పరీక్షిస్తోంది.

భారత్ వేదికగా నిర్వహించిన 2016 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టో్ర్నీకి ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోడంతో..ఆ మొత్తాన్ని బీసీసీఐ వాటా నుంచి గుంజుకోడానికి ఐసీసీ ప్రయత్నాలు ప్రారంభించింది.

అదీ చాలదన్నట్లుగా..ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్ ను సైతం తన చెప్పుచేతల్లో తీసుకోడానికి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇదీ ఐసీసీ మాట….

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి తాము చేపట్టిన సంస్కరణలు, ప్రతిపాదనలకు టెస్ట్ హోదా పొందిన దేశాలు అండగా నిలవాలంటూ…ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్స్ సన్ కోరుతున్నారు.

సభ్యదేశాల క్రికెట్ బోర్డులు తమతమ దేశవాళీ టోర్నీలను ఐసీసీ అనుమతితో, సమన్వయంతో నిర్వహించుకొంటే క్రికెట్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, క్రికెటర్లకు మేలు జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై భారత్ తో సహా సభ్యదేశాలతో ఓ కమిటీని 2018 లోనే ఏర్పాటు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.

ఐపీఎల్ లాంటి పటిష్టమైన లీగ్ లు రావాలంటే…ఐసీసీతో సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు సమన్వయం తప్పనిసరని తేల్చిచెప్పారు. ఏదేశానికి ఆదేశం తమ ఇష్టమొచ్చినట్లుగా టీ-20 లీగ్ లు నిర్వహించుకొంటూ పోతే వ్యవస్థ అస్తవ్యస్థమైపోతుందని ఐసీసీ సీఈవో హెచ్చరించారు.

First Published:  12 Aug 2019 2:53 AM GMT
Next Story