ఆగిపోయిన భారతీయుడు…. ముందుకు కదిలాడు…

ఎప్పటి నుంచో భారతీయుడు 2 సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అనే వార్తలు వచ్చాయి… కానీ అది మాత్రం ముందుకు సాగలేదు.

గత ఏడాది బిగ్ బాస్ ఫైనల్ అప్పుడు ఈ సినిమా ని ప్రకటించిన కమల్ హాసన్, దానిని త్వరగా గట్టెకించడం లో విఫలమయ్యారు. కొన్ని రోజులు షూటింగ్ చేసాక ఈ సినిమా ని ఆపేసారు. చాలా నెలలు ఈ సినిమా అలా ఆగిపోయి ఉంది. మొత్తానికి ఇప్పుడు  సినిమా షూటింగ్ భారీ స్థాయిలోనే సాగనుంది అనే విషయం అర్ధం అవుతుంది. రకుల్ ప్రీత్, సిద్దార్థ్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ రోజే ఈ సినిమా షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయమే ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ చెన్నై లో ప్రారంభం కాగా రకుల్ ప్రీత్ సెట్స్ మీద ప్రత్యక్షమైంది. ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానుల తో పంచుకుంది కాజల్ అగర్వాల్. ఇక ఈ సినిమా లో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శంకర్ ఈ సినిమా కి దర్శకుడు.