భారీగా పెరిగిన… సి.బి.ఎస్.ఇ ఫీజులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరి ఎడ్యుకేషన్ (సి బి ఎస్ ఇ ) పరీక్ష ఫీజులను భారీ గా పెంచేసింది. జనరల్ కేటాగిరీ లోని వారికి రెట్టింపు ఫీజు ను, ఎస్ సి, ఎస్ టి కేటగిరీల్లో ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న ఫీజు కంటే 24 రెట్లు ఎక్కువ పెంచడం గమనార్హం.

ఇప్పటి వరకు ఎస్ టి, ఎస్ సి లకు రూ.50 ఫీజుగా ఉండేది. పెంచిన ఫీజు ప్రకారం వీరు రూ.1200 చెల్లించాలి. జనరల్ కేటగిరి విద్యార్థులు రూ.750 ఇప్పటివరకు కట్టేవారు. కొత్తగా పెంచిన ఫీజు ప్రకారం రూ.1500 కట్టాలి.

ఈ ఫీజు 5 సబ్జెక్టుల వరకు వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు రాయాలంటే, జనరల్ అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టు కు రూ.300 చెల్లించాలి. ఎస్ సి, ఎస్ టి విద్యార్థులు ఏమీ అదనగంగా కట్టవలసిన పని లేదు.

ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మంది 10, 12 తరగతుల విద్యార్థులు సి బి ఎస్ ఇ పరీక్షలు రాయడం గమనార్హం.

అయితే ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియెషన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అసోసియేషన్ అధ్యక్షుదు, న్యాయవాది అయిన అశోక్ అగర్వాల్ ఇది రాజ్యాంగ విరుద్ధమని, కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తామని అన్నారు.