Telugu Global
NEWS

కేటీఆర్ సార్... గుర్తులేవా ఆ మాటలు !

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వారు మాత్రమే తెలంగాణవాదులని, మిగిలిన వారంతా తెలంగాణ ద్రోహులని గతంలో కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రవణ్ గుర్తుచేశారు. “బీజేపీలో చేరితే దేశభక్తులని, చేరకపోతే దేశద్రోహులని బీజేపీ ప్రకటనలు చేస్తోందంటున్న మీరు గతంలో తెలంగాణపై ఇలాంటి ప్రకటనలు చేయలేదా. అప్పుడు మీకు మంచి అనిపించనవి.. ఇప్పుడు మీకు వ్యతిరేకం కాబట్టి చెడుగా […]

కేటీఆర్ సార్... గుర్తులేవా ఆ మాటలు !
X

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వారు మాత్రమే తెలంగాణవాదులని, మిగిలిన వారంతా తెలంగాణ ద్రోహులని గతంలో కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రవణ్ గుర్తుచేశారు.

“బీజేపీలో చేరితే దేశభక్తులని, చేరకపోతే దేశద్రోహులని బీజేపీ ప్రకటనలు చేస్తోందంటున్న మీరు గతంలో తెలంగాణపై ఇలాంటి ప్రకటనలు చేయలేదా. అప్పుడు మీకు మంచి అనిపించనవి.. ఇప్పుడు మీకు వ్యతిరేకం కాబట్టి చెడుగా కనిపిస్తున్నాయా” అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపై ఆరు ప్రశ్నలను సంధించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. “మీ తప్పుడు నిర్ణయాలకు భజన చేసేవారు తెలంగాణవాదులని, వాటిని వ్యతిరేకించిన వారు తెలంగాణ ద్రోహులు అని గతంలో మీరు చేసిన ప్రకటనలు గుర్తుకు రాలేదా?” అని దాసోజు శ్రవణ్ నిలదీశారు.

ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అంటూ ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ కు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

ప్రజాస్వామ్య విలువల గురించి ప్రశ్నిస్తున్న కల్వకుంట్ల తారక రామారావుకు శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకోవడం ఎలాంటి ప్రజాస్వామ్య విలువలని? ఆయన ప్రశ్నించారు.

“ధర్నాచౌక్ ను ఎత్తివేశారు. ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెట్టారు. అప్పుడు ఈ తెలివి ఏమైంది కేటీఆర్ గారూ?” అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మత రాజకీయాలు పెరిగి పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ కు పూర్తి మతతత్వ పార్టీ అయిన మజ్లీస్ తో సంబంధాలు ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.

బిజెపి మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతోందని చెప్తున్నకేటీఆర్ రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి టీఆర్ఎస్ ఎందుకు మద్దతు పలికిందని నిలదీశారు.

” ఇంతెందుకు రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దును కూడా ఎందుకు సమర్దించారని తెలంగాణ రాష్ట్ర్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కూడా కేటీఆర్ ప్రకటనలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు గురువింద చందాన్ని గుర్తు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.

First Published:  12 Aug 2019 12:34 PM GMT
Next Story