Telugu Global
National

సెప్టెంబర్‌ నుంచి జియో ఫైబర్

రిలయన్స్ జియో మరో భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది. జియో ఫైబర్ సేవలను ప్రారంభించబోతున్నట్టు కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియోలో ప్రతి నెల 10 మిలియన్ల కస్టమర్లు వచ్చి చేరుతున్నారని వివరించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నెట్‌వర్క్‌గా జియో ఉందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ముఖేష్ అంబానీ… గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రికార్డు సృష్టించినట్టు చెప్పారు. జియో 340 మిలియన్ సబ్‌స్కైబర్స్‌ను దాటిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో […]

సెప్టెంబర్‌ నుంచి జియో ఫైబర్
X

రిలయన్స్ జియో మరో భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది. జియో ఫైబర్ సేవలను ప్రారంభించబోతున్నట్టు కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియోలో ప్రతి నెల 10 మిలియన్ల కస్టమర్లు వచ్చి చేరుతున్నారని వివరించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నెట్‌వర్క్‌గా జియో ఉందన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ముఖేష్ అంబానీ… గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రికార్డు సృష్టించినట్టు చెప్పారు. జియో 340 మిలియన్ సబ్‌స్కైబర్స్‌ను దాటిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్‌ది చాలా కీలకమైన పాత్ర అన్నారు. భారత్‌లో అత్యధిక పన్నులు చెల్లించిన కంపెనీ రిలయన్స్ మాత్రమేనన్నారు.

సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు ముఖేష్ ప్రకటించారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో నెట్ ఇస్తున్నట్టు చెప్పారు.

ఈ సేవలకు నెలకు రూ.700 నుంచి 10వేల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో 5లక్షల కుటుంబాలకు జియో ఫైబర్ సేవలు ఉచితంగా ఇస్తున్నట్టు ముఖేష్ ప్రకటించారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో పేరిట కొత్త సినిమాలు చూసే అవకాశం ఉంటుందన్నారు. వెల్‌కమ్ ఆఫర్ కింద కస్టమర్లకు 4కే హెచ్ డీ టీవీ, హెచ్ డీ సెట్ అప్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒకే కనెక్షన్ కింద బ్రాడ్ బాండ్, ఇంటర్నెట్, ల్యాండ్ లైన్ సేవలు అందించబోతున్నారు.

First Published:  12 Aug 2019 2:35 AM GMT
Next Story