డిజాస్టర్ దిశగా…. మన్మధుడు 2

అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సినిమా మన్మధుడు 2. ఈ సినిమా ప్రస్తుతం డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నాగార్జున నటించిన గత సినిమాల కంటే దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీలు కొడుతోంది. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాల మాదిరి గా కాకుండా చాలా స్లోగా బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా హిట్టు తరువాత సంగతి…. అమెరికా లో మాత్రం డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా అమెరికా లో విడుదల కాగా, సినిమా మాత్రం అస్సలంటే అస్సలు జనాలకు నచ్చలేదు. అయితే ప్రీమియర్స్ తో భారీగా వసూళ్ళు రాబట్టాలని ట్రై చేసినా….  కేవలం $82K మాత్రమే సాధించింది.

అంతే కాకుండా మొత్తంగా చూసినా ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్స్ ను రాబట్టిందని తెలుస్తోంది.