రణరంగం స్టోరీని ఆ సినిమా నుంచి ఎత్తేసారా?

శర్వానంద్ హీరో గా త్వరలో రానున్న సినిమా రణరంగం. సుధీర్ వర్మ ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం మీద ఒకప్పుడు క్లారిటీ లేదు…. కానీ అనూహ్యం గా ఈ సినిమా ని త్వరగా థియేటర్ల లో కి తీసుకొని వస్తున్నారు దర్శక నిర్మాతలు.

సాహో సినిమా వాయిదా పడటం తో ఈ సినిమా ని థియేటర్ల లో కి త్వరగా తీసుకొని వస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా కి గాడ్ ఫాథర్ సినిమా కి కనెక్షన్ ఉందట.

ఇటీవలే సుధీర్ వర్మ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… తన సినిమా కి గాడ్ ఫాథర్ సినిమా కి కనెక్షన్ ఉందని తెలిపారు. ఈ సినిమా లో తెలుగు ప్రేక్షకుల కి నచ్చే ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఉంటాయి, అలాగే గాడ్ ఫాథర్ సినిమా లాగ ఒక గ్రిప్పింగ్ కథ కూడా ఉంది అని తెలిపాడు.

సుధీర్ ముందు నుంచి ఇంగ్లీష్ సినిమాల కి కొంత అట్రాక్ట్ అవుతాడు. అందుకే ఈ సినిమా కి కూడా గాడ్ ఫాథర్ ఇన్స్ పి రేషన్ అని తెలిపాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా లో హీరోయిన్లు గా నటించారు.