అమెజాన్ వెబ్ సిరీస్ లో సమంత !

ఇటీవలే ఓ బేబీ సినిమా తెలుగు లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా ని తమిళ మరియు మలయాళ భాషల్లో కి కూడా డబ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను ఈ నెల 15 న విడుదల చేస్తున్నారు.

తమిళంలో, మళయాళంలో కూడా మంచి విజయం సాధిస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఓ బేబీ సినిమా తర్వాత సమంత ఏ సినిమా చేస్తుంది…. అనే విషయం మీద ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. కాకపోతే సమంత ఒక పెద్ద ప్రాజెక్ట్ తో రాబోతుందనే టాక్ నడిచింది.

విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు సమంత ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుందట. త్వరలో నే డిజిటల్ స్పేస్ లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుందట సమంత. ఈ అమెజాన్ వెబ్ సిరీస్ తో సమంత తనదైన ముద్ర వేయాలని ఉవ్విల్లూరుతుంది అని సమాచారం. అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ కి సమంత అత్యధిక పారితోషికం కూడా అందుకోబోతుందట.