వెబ్ సిరీస్ వైపు… శ్రద్ధా దాస్

టాలీవుడ్ లో హీరోయిన్ల సంఖ్య ఎక్కువే…. కానీ వాళ్ళకి వస్తున్న అవకాశాల సంఖ్య మాత్రం తక్కువే. అందుకే చాలా మంది హీరోయిన్లు వేరే భాషల్లో కి వెళ్లడం, లేకపోతే ఇతర మార్గాల ద్వారా పని కల్పించుకోవడం చేస్తూ ఉంటారు.

అయితే ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే అప్పుడెప్పుడో తెలుగు లో అరంగేట్రం చేసిన శ్రద్ధా దాస్  ఇప్పుడు తెలుగు లో అవకాశాల్లేక వెబ్ సిరీస్ రంగం లో కి అడుగు పెడుతుంది.

శ్రద్ధ దాస్ సుకుమార్ తీసిన ఆర్య 2 లో ఒక హీరోయిన్ గా చేయడం తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది… కానీ అవేవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు శ్రద్ధ ‘ఈ ఆఫీస్ లో’ అనే ఒక వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కి సంబందించిన రెండో సీజన్ లో శ్రద్ధా దాస్ కనిపించబోతోంది.

పవన్ సాదినేని ఈ సిరీస్ కి దర్శకుడు. శ్రద్ధ ప్రస్తుతం ఒక బెంగాలీ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో కూడా బిజీ గా ఉంది.