స్టుడియో రౌండప్ (12-08-2019)

సరిలేరు నీకెవ్వరు

మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి విజయశాంతి వచ్చిచేరింది. ఆమెకిది రీఎంట్రీ మూవీ. విజయశాంతి సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. ఆమె మేకప్ వేసుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్ రెడీ అవుతోంది.

విరాటపర్వం

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. ఈ మూవీకి సంబంధించి నిన్నటితో రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆగస్ట్ 16 నుంచి మెదక్ లోని అటవీప్రాంతంలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రానా ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్స్ పై సురేష్ బాబు , సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఎంత మంచివాడవురా

కల్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామానాయుడు స్టుడియోస్ లో వేసిన ఆఫీస్ సెట్ లో కల్యాణ్ రామ్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కల్యాణ్ రామ్, మెహ్రీన్ పై ఓ సాంగ్ తీయబోతున్నారు.

డిస్కో రాజా

రవితేజ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. అతడి కొత్త సినిమా డిస్కోరాజా షూటింగ్ ప్రస్తుతం దేశరాజధానిలో శరవేగంగా జరుగుతోంది. వర్షాల వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమౌతున్నప్పటికీ అంతా సజావుగా సాగుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. ఎన్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అఖిల్ కొత్త సినిమా

అఖిల్ నాలుగో సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని కొన్ని ఓపెన్ ఏరియాస్ లో జరుగుతోంది. ఔట్ డోర్ షూట్ కావడంతో లొకేషన్స్ ను బయటకు చెప్పడం లేదు యూనిట్. దాదాపు 4 ప్రాంతాల్లో వివిధ సెటప్స్ మధ్య 4 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.