Telugu Global
NEWS

విండీస్ పై విరాట్ కొహ్లీ అరుదైన రికార్డు

క్వీన్స్ పార్క్ వన్డేలో విరాట్ షో వన్డే క్రికెట్లో కొహ్లీ 42వ సెంచరీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ గా నిలిచాడు. తీన్మార్ సిరీస్ లో భాగంగా…ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా ముగిసిన రెండోవన్డేలో కొహ్లీ స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీ సాధించాడు. కొహ్లీ 8వ శతకం పోర్ట్ -ఆఫ్ – స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా ముగిసిన […]

విండీస్ పై విరాట్ కొహ్లీ అరుదైన రికార్డు
X
  • క్వీన్స్ పార్క్ వన్డేలో విరాట్ షో
  • వన్డే క్రికెట్లో కొహ్లీ 42వ సెంచరీ

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ గా నిలిచాడు.

తీన్మార్ సిరీస్ లో భాగంగా…ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా ముగిసిన రెండోవన్డేలో కొహ్లీ స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీ సాధించాడు.

కొహ్లీ 8వ శతకం

పోర్ట్ -ఆఫ్ – స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో కొహ్లీ మొత్తం 125 బాల్స్ ఎదుర్కొని 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 120 పరుగులు సాధించడం ద్వారా.. వెస్టిండీస్ ప్రత్యర్థిగా 8వ శతకం సాధించాడు.

ఈ క్రమంలో వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో క్రికెటర్ గా నిలిచాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించడం ద్వారా మాస్టర్ సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

సౌరవ్ రికార్డు తెరమరుగు…

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 311 వన్డేలలో 11 వేల 363 పరుగులు సాధిస్తే…విరాట్ కొహ్లీ మాత్రం 231 వన్డేలలోనే గంగూలీ రికార్డును అధిగమించాడు.

అంతేకాదు…సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల రికార్డుకు కేవలం 7 శతకాల దూరంలో మాత్రమే నిలిచాడు.

విండీస్ పై కొహ్లీ మరో రికార్డు…

విండీస్ ప్రత్యర్థిగా తన కెరియర్ లో 34వ వన్డే ఆడిన కొహ్లీ 8వ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో…విండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకొన్నాడు.

గత 26 సంవత్సరాలుగా పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ అధిగమించాడు.

విండీస్ పై మియాందాద్ 64 మ్యాచ్ ల్లో 1930 పరుగులు సాధిస్తే…కొహ్లీ కేవలం 34 మ్యాచ్ ల్లోనే 2వేలకు పైగా పరుగులు సాధించడం విశేషం.

ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ 238 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 42 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలతో సహా 11 వేల 406 పరుగులు సాధించాడు.

First Published:  12 Aug 2019 3:16 AM GMT
Next Story