Telugu Global
NEWS

మాట నిలుపుకుంటూ.... ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక బీసీ, ఒక మైనారిటీ, ఒక ఓ సి అభ్యర్థిని ప్రకటించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న మోపిదేవి వెంకటరమణ… వైసిపి పార్టీ ప్రారంభం నుంచీ ఉన్నారు. ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో […]

మాట నిలుపుకుంటూ.... ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
X

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక బీసీ, ఒక మైనారిటీ, ఒక ఓ సి అభ్యర్థిని ప్రకటించారు.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న మోపిదేవి వెంకటరమణ… వైసిపి పార్టీ ప్రారంభం నుంచీ ఉన్నారు. ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేస్తున్నారు.

వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ బీసీల్లో ఒక బలమైన సామాజిక వర్గమైన మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు మంత్రి గాను, శాసన సభ్యునిగానూ పని చేసిన అనుభవం ఉండటం, పార్టీతో మంచి అనుబంధం ఉండటం, బీసీ కావడం వల్ల వెంకటరమణని ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఎంపిక చేశారని అంటున్నారు.

మైనారిటీ వర్గం నుంచి మహమ్మద్ ఇక్బాల్ కి ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు జగన్. అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం లో టిడిపి బలమైన అభ్యర్థి బాలకృష్ణకు ప్రత్యర్ధిగా వైసీపీ తరఫున నిలబడ్డారు ఇక్బాల్. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి కూడా. పదవీ విరమణ అనంతరం వైసిపి తరఫున హిందూపురం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇక్బాల్ పరాజయం చెందారు.

ఆయన విద్యార్హతలు, పరిపాలన అనుభవం, మైనార్టీ వర్గానికి చెందిన వాడు కావడం వంటి కారణాలతో మైనార్టీ కోటాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ ఇక్బాల్ కు అవకాశం కల్పించారని చెబుతున్నారు.

ఇక మూడో అభ్యర్థి కర్నూలు జిల్లా వైసిపి సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి. ఈయన కూడా శాసనసభ్యునిగా పని చేశారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికల ముందు ఓ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఓసి కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చారు.

బీసీ,ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏ పదవుల్లో నైనా సరే 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి… ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన మాట నిలుపుకుంటూ అభ్యర్థులను ఖరారు చేశారు. రేపు, ఎల్లుండి ఈ ముగ్గురు వైసిపి అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించ బోతున్నారని తెలుస్తోంది.

First Published:  12 Aug 2019 2:50 AM GMT
Next Story