Telugu Global
NEWS

బైక్ రేసింగ్ లో భారత యువతి సంచలనం

ప్రపంచ కప్ నెగ్గిన భారత తొలి మహిళ ఐశ్వర్య 23 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే మగధీరులే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం సాధారణ విషయమే. అయితే..మహిళలు బైక్ రేసింగ్ లో పోటీకి దిగటం…అదీ భారత్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఈ ఘనత సాధించడం అసాధారణ విషయం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హంగెరీలోని వార్పలోటా వేదికగా ముగిసిన ఎఫ్ఐఎమ్ ప్రపంచకప్ మోటార్ రేసింగ్ […]

బైక్ రేసింగ్ లో భారత యువతి సంచలనం
X
  • ప్రపంచ కప్ నెగ్గిన భారత తొలి మహిళ ఐశ్వర్య
  • 23 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే మగధీరులే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం సాధారణ విషయమే.

అయితే..మహిళలు బైక్ రేసింగ్ లో పోటీకి దిగటం…అదీ భారత్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఈ ఘనత సాధించడం అసాధారణ విషయం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

హంగెరీలోని వార్పలోటా వేదికగా ముగిసిన ఎఫ్ఐఎమ్ ప్రపంచకప్ మోటార్ రేసింగ్ మహిళ టైటిల్ ను భారత యువతి, బెంగళూరు బుల్లెట్ ఐశ్వర్య పిస్సే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలిమహిళగా నిలిచింది.

18 సంవత్సరాల వయసు నుంచే మోటార్ బైక్ నడపడం నేర్చుకొన్న ఈ బెంగళూరు యువతి.. నిరంతర సాధనతో బైక్ రేసర్ స్థాయికి ఎదిగింది.

దుబాయ్ ఇసుక ఎడారులు, హిమాలయాలలోని మంచుపర్వతాలలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేస్ ల్లో పాల్గొని సత్తా చాటుకొంది.

2019 మోటార్ స్పోర్ట్స్ సర్క్యూట్ మహిళల విభాగంలో.. సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొన్న ఐశ్వర్య..సీనియర్ విభాగంలో విశ్వవిజేతగాను, జూనియర్ విభాగంలో రన్నరప్ గాను నిలిచి భారత మహిళల సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పింది.

నాలుగు రేస్ ల్లోనూ టాప్

దుబాయ్ వేదికగా ముగిసిన తొలి అంచె రేస్ లో విజేతగా నిలిచిన ఐశ్వర్య.. పోర్చుగల్ రేస్ లో మూడు, స్పెయిన్ రేస్ లో ఐదు, హంగెరీ రేస్ లో నాలుగు స్థానాలలో నిలవడం ద్వారా… మొత్తం 65 పాయింట్లతో ప్రపంచకప్ సొంతం చేసుకోగలిగింది.

పోర్చుగల్ కు చెందిన రీటా వియారా 61 పాయింట్లతో రన్నరప్ గా నిలిచింది.

జూనియర్ విభాగంలోనూ..

జూనియర్ విభాగంలోనూ పోటీకి దిగిన ఐశ్వర్య 46 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకొంది. చిలీకి చెందిన థామస్ డీ గవాడో 60 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ ట్రోఫీ అందుకొంది.

మొత్తం మీద..మోటార్ స్పోర్ట్ లో అడుగుపెట్టిన ఐదేళ్ల కాలంలోనే ఐశ్వర్య ఆరు జాతీయ టైటిల్స్ తో పాటు…విశ్వవిజేతగా కూడా నిలవడం ద్వారా.. భారత నవతరానికి స్ఫూర్తిగా, గర్వకారణంగా మిగిలింది.

First Published:  13 Aug 2019 12:30 AM GMT
Next Story