చిరంజీవి…. నిజంగానే సర్జరీ చేయించుకున్నారా?

ఈ మధ్యనే ‘సై రా’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం బరువు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టారన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తన కొత్త లుక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన చిరు… అందరినీ షాక్ కి గురి చేశారు.

ఈ కొత్త లుక్ కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. ఒక డైట్ ఎక్స్ పర్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి అన్ని విధాలుగా కష్టపడి ఇలా మారారని సమాచారం. కానీ చిరంజీవి కొత్త లుక్ గురించి ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మార్పు చోటు చేసుకోవడం చాలా కష్టమని… కానీ చిరంజీవి కి ఇది ఎలా సాధ్యమైంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కొందరేమో చిరంజీవి కచ్చితంగా సర్జరీ చేయించుకుని ఉంటారని అందుకే ఇలా మారిపోయారని వాదిస్తుండగా…. మరికొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

కీటో డైట్ ఫాలో అవడం వలన కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని… ఈ వయసులో చిరంజీవి సర్జరీ వైపు మొగ్గు చూపకుండా కీటో డైట్ ఫాలో అయ్యే బరువు తగ్గారని మరి కొందరు చెబుతున్నారు.