జియో సంచలనంతో… సినిమా ఇండస్ట్రీ,  థియేటర్లకు కష్టాలేనా?

ముఖేష్ అంబానీ.. దేశంలోనే అపర కుబేరుడు.. జియోతో దేశానికి డిజిటల్ సేవలు అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్ తీసుకొస్తున్నామని ప్రకటించారు.

అయితే ఇందులో ఇంటర్నెట్ తోపాటు ఉచితంగా ఫోన్ సౌకర్యం, సెట్ అప్ బాక్స్ తో చానెల్స్ చూసేలా మూడింటిని ఒకే ప్లాన్ లో పెట్టారు.

వినియోగదారులంతా జియో గిగా ఫైబర్ ఎప్పుడు వస్తుందా? అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు ముఖేష్ అంబానీ… జియో గిగా ఫైబర్ తీసుకునే వాళ్లకు ఇకపై సినిమా విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుడు ఆ సినిమాను ఇంట్లోనే టీవీలో చూసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి, థియేటర్లకు మేలు చేస్తుందా.? కీడు చేస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం సినిమాలు చూడడానికి ఫ్యామిలీ అంతా 1000 వరకు ఖర్చుపెట్టి థియేటర్లకు వెళ్లి చూసి వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే సినిమాను జియో చూపిస్తే వినియోగదారులకు హ్యాపీనే కానీ.. జనాలు లేక థియేటర్లన్నీ బోసిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు. తొలిరోజే ఈ షోలు చూపిస్తే ఇక థియేటర్లకు ఎవరూ రారు. దీంతో థియేటర్లు మూసివేసే పరిస్థితి ఏర్పడవచ్చు.

ఇప్పటికే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలను రిలీజ్ చేస్తుండడంతో చాలా మంది థియేటర్లకు రావడం మానేశారు. ఇప్పుడు జియో గనుక సినిమాలు కొని రిలీజ్ చేస్తే సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బేనంటున్నారు. థియేటర్స్ బిజినెస్ మొత్తం జియోకు వెళ్లి అవి మూతపడి నిర్మాతలకు నష్టం అంటున్నారు. మరి సినీ పరిశ్రమ ఈ జియో ధాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.