థ్రిల్లర్ సినిమా కోసం…. భారీ రెమ్యూనరేషన్

‘మహానటి’ సినిమా తో కీర్తి సురేష్ అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే ‘మన్మధుడు 2’ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు సౌత్ లో సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా కీర్తి ఒక హిందీ సినిమాకు కూడా సైన్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టనుంది.

తాజాగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం లో ఒక తమిళ సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ఆసక్తి కరమైన పాత్రలో కనిపించబోతోందని అంటున్నారు.

అయితే ఈ సినిమాలోని తన పాత్ర కోసం కీర్తిసురేష్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

అంతేకాకుండా టాలీవుడ్ లోని ఒక పెద్ద స్టార్ ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కానీ ఆ స్టార్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ థ్రిల్లర్ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా…. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారట. ఇప్పటిదాకా కీర్తిసురేష్ థ్రిల్లర్ సినిమాలో కనిపించలేదు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు కూడా త్వరలో ప్రకటించనున్నారు.