Telugu Global
NEWS

గంటా, కేశినేని డుమ్మా

టీడీపీలో అసంతృప్తులు అధికమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలో తెల్ల ఏనుగులు ఎక్కువయ్యాయని… వారికే ప్రాధాన్యత లభిస్తోందని విమర్శించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను టీడీపీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ విస్త్రృత స్థాయి సమావేశం సందర్బంగానే గోరంట్ల ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని నాని డుమ్మా కొట్టారు. వీరిద్దరు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఈ సమావేశానికి హాజరుకాలేదని చెబుతున్నారు. తాను […]

గంటా, కేశినేని డుమ్మా
X

టీడీపీలో అసంతృప్తులు అధికమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలో తెల్ల ఏనుగులు ఎక్కువయ్యాయని… వారికే ప్రాధాన్యత లభిస్తోందని విమర్శించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను టీడీపీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ విస్త్రృత స్థాయి సమావేశం సందర్బంగానే గోరంట్ల ఈ ప్రకటన చేశారు.

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని నాని డుమ్మా కొట్టారు. వీరిద్దరు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఈ సమావేశానికి హాజరుకాలేదని చెబుతున్నారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు బాగా ప్రచారం సాగిన నేపథ్యంలో పీఏసీ చైర్మన్ పదవి తప్పకుండా తనకే చంద్రబాబు కట్టబెడుతారని గంటా భావించారు. కానీ చంద్రబాబు తన సొంత సామాజికవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్‌కు ఆ పదవి అప్పగించారు.

అప్పటి నుంచి గంటా మరింత అసంతృప్తితో ఉన్నారు. ఇక కేశినేని నానిది నిత్య అసంతృప్త రాగమే. ఎంపీగా తాను గెలిచినప్పటికీ జిల్లా టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, బుద్దా వెంకన్నలదే హవా నడుస్తోంది. కేశినేని నాని యాక్షన్ లేకుండా కేవలం నిరసన ట్వీట్లు మాత్రమే చేస్తూ ఉండడంతో అతడిని ఇప్పుడు టీడీపీలో ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని ఈ సమావేశానికి డుమ్మా కొట్టినట్టు భావిస్తున్నారు. పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న బోండా ఉమా, దేవినేని అవినాష్ మాత్రం తాము పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు.

First Published:  13 Aug 2019 4:17 AM GMT
Next Story