Telugu Global
NEWS

కర్నూలును తాకిన వరద

కృష్ణ నది వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం డ్యాంకు 8 లక్షల 20వేల క్కూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సాగర్‌కు 8. 48 లక్షల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 313 టీఎంసీలు కాగా… ఇప్పటికే 242 టీఎంసీల నీరు చేరింది. సాగర్ నుంచి పులిచింతులకు 4. 28 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అటు తుంగభద్ర నుంచి, ఇటు కృష్ణ నుంచి […]

కర్నూలును తాకిన వరద
X

కృష్ణ నది వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం డ్యాంకు 8 లక్షల 20వేల క్కూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సాగర్‌కు 8. 48 లక్షల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 313 టీఎంసీలు కాగా… ఇప్పటికే 242 టీఎంసీల నీరు చేరింది. సాగర్ నుంచి పులిచింతులకు 4. 28 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

అటు తుంగభద్ర నుంచి, ఇటు కృష్ణ నుంచి భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలం బ్యాక్‌ వాటర్ వెనక్కు తంతోంది. కర్నూలు నగరానికి సమీపంగా బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ చేరాయి. ఒకటో పట్టణం, జొహరాపురం వద్దకు నీరు చేరుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

2009 నాటి పరిస్థితి వస్తుందేమోనని, నగరాన్ని మరోసారి వరద ముంచెత్తుంతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం భయపడాల్సిన పనిలేదంటున్నారు. 2009లో 23 లక్షల క్కూసెక్కుల ప్రవాహం రావడంతో ఇబ్బంది వచ్చిందని… ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్పలు నగరంలో పర్యటించి ప్రజలకు పరిస్థితిని వివరిస్తున్నారు.

First Published:  12 Aug 2019 8:19 PM GMT
Next Story