చెట్టు పైనే నివాసం…. కారణం ఏంటంటే….

ఒడిషా లోని కుసుమ పురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెట్టు పై అడ్డం గా కర్రల తో నిర్మించుకున్న వేదిక పై నివాసం ఉంటున్నాడు. ఇదేదో సరదా కోసం చేసుకున్న ఏర్పాటు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చెట్టుపై కాపురం ఉంటున్నాడు.

అసలేం జరిగిందంటే…

ఈ గ్రామం పై ఏనుగులు తరచుగా దాడి చేస్తూ ఉంటాయి. వాటి బాధ పడలేక జనం చెట్లను ఆశ్రయిస్తున్నారన్న మాట. ఇటీవల ఎ ఎన్ ఐ వార్తా సంస్థ ఈ గ్రామాన్ని సందర్శించింది. చెట్టుపై తన కుమారునితో కలిసి నివసిస్తున్న కుద్య మహకుద్ అనే వ్యక్తిని పలకరించింది.

మూడు రోజుల క్రితం ఏనుగుల మంద దాడి చేసి తన ఇంటిని నేలమట్టం చేసిందని, రాత్రి పూట ఏనుగులు నిద్ర లేకుండా చేస్తున్నాయని కుద్య చెప్పాడని, ప్రభుత్వం వెంటనే తనకి ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నాడని…. ఆ వార్తా సంస్థ బెబుతోంది. ఈ గ్రామం కియోజర్ జిల్లాలో ఉంది.

అటవీ శాఖ సదర్ రేంజ్ ఆఫీసర్ మాత్లాడుతూ… “మేం అతడికి త్వరగా నష్ట పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అతడిని కలిసి అర్థమయ్యేలా చెప్పాం” అన్నారు.

జిల్లా యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. ఏనుగుల గుంపును ట్రాక్ చెయ్యడానికి ఓ ట్రాకర్స్ టీం ని 100 మందితో ఏర్పాటు చేసింది.