తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు ఓ గెలుపు

  • ప్రో-కబడ్డీలీగ్ -7లో గుజరాత్ పై విజయం

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్లో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు ఓ గెలుపుతో ఊపిరిపీల్చుకొంది.

హైదరాబాద్ అంచె పోటీలలో దారుణంగా విఫలమైన తెలుగు టైటాన్స్ జట్టు…అహ్మదాబాద్ అంచె పోటీలలో మాత్రం బోణీ కొట్టింది.

ఆతిథ్య గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ ను 30-24 పాయింట్లతో చిత్తు చేసింది.

తెలుగు టైటాన్స్ జట్టు రైడింగ్ తో పాటు బ్లాకింగ్ లోనూ అత్యుత్తమంగా రాణించింది. అహ్మదాబాద్ ఏకా ఎరీనా వేదికగా జరిగిన ఈ పోటీ ప్రారంభం నుంచి తెలుగుటైటాన్స్ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

టైటాన్స్ రైడర్లు విశాల్ భరద్వాజ్ 5 పాయింట్లు, సిద్ధార్ధ్ దేశాయ్ 7 పాయింట్లు సాధించడం ద్వారా జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

టైటాన్స్ సాధించిన మొత్తం 30 పాయింట్లలో 16 రైడింగ్ పాయింట్లు ఉండటం విశేషం. ప్రస్తుత సీజన్లో తెలుగు టైటాన్స్ కు ఇదే తొలిగెలుపు.