Telugu Global
NEWS

డీఐజీ ఫైర్... లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడంతో పాటు, పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి చివరకు జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో రాపాకే స్వయంగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. రాజోలు నియోజక వర్గం మలికిపురంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో స్థానిక ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి కుమార్ గెస్ట్‌హౌజ్‌లో 9 మందిని అరెస్ట్ చేశారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాపాక … ఎస్‌ఐపై […]

డీఐజీ ఫైర్... లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే
X

పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడంతో పాటు, పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి చివరకు జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో రాపాకే స్వయంగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

రాజోలు నియోజక వర్గం మలికిపురంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో స్థానిక ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి కుమార్ గెస్ట్‌హౌజ్‌లో 9 మందిని అరెస్ట్ చేశారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాపాక … ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేకాట ఆడితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. అయినప్పటికీ పోలీసులు తొమ్మిది మందిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే… వంద మంది జనసేన కార్యకర్తలను వెంటేసుకుని వెళ్లి స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులను బండబూతులు తిట్టారు.

జనసేన కార్యకర్తలు స్టేషన్‌లోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అప్పుడు సిబ్బంది తక్కువగా ఉండడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. స్టేషన్‌పై దాడి అంశాన్ని జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు.

డీఐజీ ఏఎస్ ఖాన్ స్వయంగా వెళ్లి స్టేషన్‌ను పరిశీలించారు. స్థానిక పోలీసులకు ధైర్యం చెప్పారు. స్టేషన్‌పైనే దాడి చేసినా… చేతులు కట్టుకుని కూర్చుంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇతరులు కూడా ఇదే తరహాలో వ్యవహరించే అవకాశం ఉందని డీఐజీ అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే, జనసేన కార్యకర్తల దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ కూడా ఉండడంతో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే రాపాకను ఏ1గా చేర్చారు. స్టేషన్‌పై దాడి చేసినా పెద్దగా చర్యలు ఉండవని భావించిన జనసేన కార్యకర్తలు కంగుతిన్నారు.

స్టేషన్‌పై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని గమనించిన రాపాక తానే స్వయంగా వెళ్లి స్టేషన్ లో లొంగిపోయారు. ఈ పరిణామంపై స్థానికులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి పేకాట ఆడేవారి కోసం స్టేషన్‌పై దాడి చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

First Published:  13 Aug 2019 4:36 AM GMT
Next Story