‘సాహో’ పాటలు… నచ్చకపోవడానికి కారణం అదేనా?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్ లో మరొక ప్రతిష్టాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘సాహో’. ఈ సినిమాతో బాలీవుడ్ లో సైతం హీరోగా అడుగుపెట్టబోతున్నాడు ప్రభాస్.

ఇంతకుముందు ఈ సినిమాకి శంకర్-ఎహ్సాన్-లోయ్ సంగీతాన్ని అందించాల్సి ఉంది. కానీ వాళ్లు తప్పుకున్న తర్వాత సినిమా కోసం కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాటలు బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే అలరించాయి…. కానీ బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగా అయిపోవడం వల్ల తెలుగు ప్రేక్షకులను పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయాయని అంటున్నారు.

టి సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ కూడా ‘సాహో’ సినిమా లోని పాటలు హిందీ భాషలో కేవలం బాలీవుడ్ ఆడియన్స్ కోసం కావాలని చేయించామని అలాగే తెలుగులో కూడా లిరిక్స్ బాగా రాయించాము అని, పాటలన్నీ దర్శకుడు సుజిత్ అభిరుచులకు తగ్గట్టుగా వచ్చాయని తెలిపారు.

ఆయన ఈ సినిమా ఆడియో రైట్స్ ని, థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తం పెట్టి మరీ కొనుగోలు చేశారు. ఎంత తెలుగులో లిరిక్స్ స్పెషల్ గా చేయించినప్పటికీ బాలీవుడ్ ఫ్లేవర్ ఉన్న ఈ సంగీతం తెలుగు ప్రేక్షకులకి పెద్దగా నచ్చటం లేదు.

అయితే వినటానికి ఎలా ఉన్నా సినిమాలో విజువల్స్ మాత్రం కచ్చితంగా అన్ని భాషల ప్రేక్షకులని అబ్బురపరిచే విధంగా ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.