అందుకే రవితేజ తో సినిమా కుదరలేదు…

‘స్వామి రారా’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన సుధీర్ వర్మ ‘దోచేయ్’, ‘కేశవ’ వంటి సినిమాల తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు.

అయితే తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘రణరంగం’ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. అయితే ‘రణరంగం’లో రవి తేజ నే హీరోగా నటించాల్సిందట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ వర్మే చెప్పాడు.

“రణరంగం సినిమా లో నిజానికి కొన్నేళ్ల క్రితమే రవి తేజ హీరోగా నటించాల్సింది. కానీ రవి తేజ వేరే సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల అది కుదరలేదు. ఈలోపు శర్వా కి కథ నచ్చింది. కాబట్టి రవి తేజ ని అడిగి శర్వా తో ఈ సినిమా మొదలుపెట్టాం” అని చెప్పుకొచ్చారు సుధీర్ వర్మ.

ఏదేమైనా రవి తేజ హీరోగా నటించాల్సిన ఈ సినిమా శర్వా చేతికి దక్కింది. మరి ఈ సినిమా శర్వా కి ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ పిళ్ళై సంగీతాన్ని అందిస్తున్నారు.