సీఎం మందలింపుతో సీఎస్‌ అలక

తెలంగాణ సీఎం ఎస్‌కే జోషి నొచ్చుకున్నారు. సచివాలయం తరలింపు ఆలస్యంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశంలో కోప్పడడంతో సీఎస్ అలకబూనారు.

ఉన్నతాధికారుల సమక్షంలోనే కేసీఆర్ తనను మందలించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం సచివాలయం తరలింపుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

సచివాలయం తరలింపు ఇంత జాప్యం అవుతున్నా? ఏం చేస్తున్నారని సమావేశంలో సీఎస్‌పై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

పాత సచివాలయం ముఖం కూడా తాను చూడబోనని సీఎస్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. ఏదైనా పని ఉంటే ఇంటి వద్దకే రావాలని సూచించారని చెబుతున్నారు.

ఆర్‌ అండ్ బీ పర్యవేక్షణ కూడా ఉన్న సచివాలయం తరలింపు వ్యవహారంలో తనను మాత్రమే సీఎం బాధ్యుడిని చేయడంపై సీఎస్‌ అలక బూనారు. కొత్త సచివాలయంలో పనులన్నీ పూర్తయిన తర్వాత చెప్పాలని…. అక్కడికే తాను నేరుగా వస్తానని ఆయన అధికారులతో చెప్పినట్టు తెలుస్తోంది.