Telugu Global
NEWS

వేటకొడవళ్లతో దొంగలు... వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

తమిళనాడులో వృద్ధ దంపతుల ధైర్యసాహసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేటకొడవళ్లతో వచ్చిన దొంగలను వృద్ధ దంపతులు ఎదుర్కొన్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. తిరునల్వేలి జిల్లా కడియంకు చెందిన షణ్ముగవేల్, సెంతామరై దంపతులు ఇంట్లో ఉండగా రాత్రి సమయంలో దొంగలు దాడి చేశారు. తొలుత వెనుక నుంచి వచ్చి షణ్ముగవేల్‌ను చైర్‌కు కట్టేసే ప్రయత్నం చేశాడు దొంగ. దీన్ని గమనించిన అతడి భార్య అక్కడే ఉన్న చెప్పులు తీసుకుని దొంగపై విసరసాగింది. ఇంతలో మరో దొంగ వచ్చాడు. […]

వేటకొడవళ్లతో దొంగలు... వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
X

తమిళనాడులో వృద్ధ దంపతుల ధైర్యసాహసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేటకొడవళ్లతో వచ్చిన దొంగలను వృద్ధ దంపతులు ఎదుర్కొన్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. తిరునల్వేలి జిల్లా కడియంకు చెందిన షణ్ముగవేల్, సెంతామరై దంపతులు ఇంట్లో ఉండగా రాత్రి సమయంలో దొంగలు దాడి చేశారు.

తొలుత వెనుక నుంచి వచ్చి షణ్ముగవేల్‌ను చైర్‌కు కట్టేసే ప్రయత్నం చేశాడు దొంగ. దీన్ని గమనించిన అతడి భార్య అక్కడే ఉన్న చెప్పులు తీసుకుని దొంగపై విసరసాగింది. ఇంతలో మరో దొంగ వచ్చాడు. ఆమెపై దాడికి ప్రయత్నించాడు. తేరుకున్న షణ్ముగ అక్కడే ఉన్న చైర్‌తో దొంగలపై ఎదురుదాడికి దిగారు.

దొంగలు వెంటనే తమ వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లను బయటకు తీశారు. అయినా సరే షణ్ముగవేల్ దంపతులు వెనక్కు తగ్గలేదు. మరింత దూకుడుగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ కూర్చీలతో పోరాటం చేశారు. దొంగల చేతిలో వేటకొడవళ్లు ఉండడంతో ప్లాస్టిక్‌ కూర్చీలు ముక్కలు ముక్కలు అయ్యాయి. దంపతులు మాత్రం ఫైట్‌ కొనసాగించారు.

చివరకు వేటకొడవళ్లు ఉన్నప్పటికీ దొంగలు ఏమీ చేయలేకపోయారు. ఎదురుదాడికి భయపడి దొంగలు పారిపోయారు. ఈ పోరాటం అంతా సీపీ కెమెరాల్లో రికార్డు అయింది. సోషల్ మీడియాలో వృద్ధ దంపతుల పోరాటానికి, ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.

First Published:  12 Aug 2019 10:04 PM GMT
Next Story