సరిలేరు నీకెవ్వరు…. విజయశాంతి పాత్ర ఇదే !

‘మహర్షి’ సినిమాతో తన కెరియర్లో 25 సినిమాలు పూర్తి చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగశౌర్య, విజయ్ దేవరకొండ వంటి యువ హీరోలతో రొమాన్స్ చేసిన రష్మిక మందన్న ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ స్టార్  తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా రాజకీయాల్లో బిజీ అయిపోయిన విజయశాంతి ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విజయశాంతి పాత్ర గురించి చర్చ జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే విడుదలైన మోషన్ పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. రామబ్రహ్మం సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.