క్రికెట్ మక్కాలో ఇంగ్లండ్ డూ ఆర్ డై ఫైట్

  • నేటినుంచే యాషెస్ సిరీస్ రెండోసమరం
  • ఇంగ్లండ్ తురుపుముక్క జోఫ్రా ఆర్చర్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా… ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్…రెండో టెస్ట్ కే వేడెక్కింది.

మొదటి టెస్టులో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్ర్రేలియా వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తుంటే…మరోవైపు తొలిదెబ్బతో కంగుతిన్నఇంగ్లండ్ రెండోటెస్టులో ఆరునూరైనా నెగ్గి సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఇంగ్లండ్ జట్టులో రెండుమార్పులు….

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో ఓటమి పొందిన ఆతిథ్య ఇంగ్లండ్..రెండుమార్పులతో తుదిజట్టును ప్రకటించింది.

క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో పాల్గొనే ఇంగ్లండ్ తుదిజట్టు నుంచి ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని తప్పించి…స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్ బౌలర్ జాక్ లీచ్ కు చోటు కల్పించారు.

ఇంగ్లండ్ తురుపుముక్క ఆర్చర్….

గాయంతో తొలిటెస్ట్ కు అందుబాటులో లేకుండాపోయిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్…రెండోటెస్టులో ఇంగ్లండ్ తురుపుముక్కగా
బరిలోకి దిగుతున్నాడు.

కంగారూ టాపార్డర్ టాప్ లేపుతానంటూ ఇప్పటికే వార్నింగ్ వెంట వార్నింగ్ ఇస్తూ ఇంగ్లండ్ మైండ్ గేమ్స్ కు తెరతీశాడు.

కంగారూజట్టులో మిషెల్ స్టార్క్…

ఇక..ఆస్ట్ర్రేలియా సైతం తుదిజట్టులో రెండుమార్పులు చేసింది. జీవంలేని లార్డ్స్ వికెట్ కు తగ్గట్టుగా బౌలింగ్ ఎటాక్ ను సిద్దం చేసింది.

తుదిజట్టు లో ఫాస్ట్ బౌలర్లు మిషెల్ స్టార్క్, జోష్ హెజిల్ వుడ్ లకు చోటు కల్పించి…తొలిటెస్టులో పాల్గొన్న పాటిన్ సన్ ను పక్కన పెట్టారు.

ఇంగ్లండ్ నయాఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను దీటుగా ఎదుర్కొనగలమని కోచ్ జస్టిన్ లాంగర్ ధీమాగా చెబుతున్నాడు.
ఏదిఏమైనా…ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ కే…లార్డ్స్ టెస్ట్ ఫలితం నిర్ణయాత్మకం కానుంది.