Telugu Global
National

రాముడి వారసులమంటూ రాజ వంశాల క్యూ....

అయోధ్య వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇటీవల… అయోధ్యలో రాముడు వారసులెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. దాంతో రాముడి వారసుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పలువురు పోటీ పడి తమను తామే రాముడు వారసులుగా చెప్పుకుంటున్నారు. సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని నిరూపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. రాముడి వారసులం తామేనంటూ జైపూర్ యువరాణి, ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ చరిత్రను సాక్ష్యాలతో సహా సుప్రీం కోర్టు ముందు […]

రాముడి వారసులమంటూ రాజ వంశాల క్యూ....
X

అయోధ్య వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇటీవల… అయోధ్యలో రాముడు వారసులెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. దాంతో రాముడి వారసుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పలువురు పోటీ పడి తమను తామే రాముడు వారసులుగా చెప్పుకుంటున్నారు. సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని నిరూపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

రాముడి వారసులం తామేనంటూ జైపూర్ యువరాణి, ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ చరిత్రను సాక్ష్యాలతో సహా సుప్రీం కోర్టు ముందు నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు. తన తండ్రి భవానీ సింగ్ కుశుడికి 309వ వంశీకుడని ప్రకటించారు.

రాజస్థాన్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యేంధ్ర రాఘవ్‌… రాముడికి అసలైన వారసులం తామేనంటూ ప్రకటించుకున్నారు. తమది లవుడి వంశమని ఆయన చెప్పుకున్నారు. రాముడి కుమారుడైన లవుడి తరువాత మూడవ తరానికి చెందిన బద్గుజార్ గోత్రస్తులమని చెప్పారు. వాల్మీకి రామాయణంలో కూడా ఇందుకు ఆధారాలున్నాయని చెప్పుకున్నారు.

అటు మేవార్‌ రాజవంశం కూడా తాము రాముడి వారసులం అని ప్రకటించింది. తమది రాముడి వంశమైన ఇక్ష్వాక వంశమని మేరావ్ వంశీకుడు అరవింద్ సింగ్ మేవార్ ట్వీట్ చేశారు. తమది రాముడి వంశమని చరిత్రే చెబుతోందన్నారు. కానీ తాము రామజన్మభూమిపై హక్కులు కోరబోమని… కేవలం అక్కడ రామాలయం నిర్మించాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రకటించారు.

వీరే కాకుండా రాజస్థాన్‌ రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కూడా రాముడి వారసులం అంటూ తెరపైకి వచ్చారు. సూర్యవంశీ రాజ్‌పుత్‌లమైన తాము కూడా శ్రీరాముడి వంశస్తులమేనని ప్రకటించారు. అందుకు తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని… సుప్రీం కోర్టు అడిగితే వాటిని సమర్పిస్తామని ప్రకటించారు.

First Published:  14 Aug 2019 12:20 AM GMT
Next Story