Telugu Global
NEWS

ముంపుకు.... చంద్రబాబు నివాసం... వస్తువులు పై అంతస్తుకు...

పదేళ్ల తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపం…. కరకట్ట అక్రమ కట్టడం దారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేశారు. పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోంది. దాంతో 70 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. పశ్చిమ కనుమల్లో ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రవాహం తీవ్రత మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కొద్దిరోజుల్లోనే […]

ముంపుకు.... చంద్రబాబు నివాసం... వస్తువులు పై అంతస్తుకు...
X

పదేళ్ల తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపం…. కరకట్ట అక్రమ కట్టడం దారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేశారు. పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోంది. దాంతో 70 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

పశ్చిమ కనుమల్లో ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రవాహం తీవ్రత మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కొద్దిరోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ వద్దకు ప్రవాహం రెట్టింపు కావొచ్చు అని చెబుతున్నారు. ఇప్పటి వరదే కృష్ణ కరకట్టను కృష్ణమ్మ తాకబోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ నిర్మాణ దారులను అప్రమత్తం చేశారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన పలు ఆశ్రమాల్లో ఉంటున్న వారిని తరలిస్తున్నారు.

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనాన్ని కూడా కృష్ణమ్మ తాకుతూ ప్రవహిస్తోంది. దాంతో చంద్రబాబునాయుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. చేతి గాయం కారణంగా విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

లింగమనేని భవనాన్ని వరద తాకడం ఖాయమైపోవడంతో చంద్రబాబు కాన్వాయ్‌ని అక్కడి నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. లింగమనేని భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న వస్తువులను మొదటి అంతస్తుపైకి చేర్చారు.

First Published:  13 Aug 2019 10:29 PM GMT
Next Story