శ్రీలక్ష్మిని రిలీవ్ చేయాలని కేంద్రం ఆదేశం

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మి తనను ఏపీకి పంపించాల్సిందిగా కోరారు. ఇందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించాయి. ఫైల్‌ కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్లింది.

అక్కడ కాస్త ఆలస్యం అయినప్పటికీ ఎట్టకేలకు ఆమెను ఏపీకి డిప్యుటేషన్‌ పైన పంపేందుకు కేంద్రం అంగీకరించింది. ఫైల్‌ను క్లియర్ చేసింది.

శ్రీలక్ష్మి ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు వీలుగా రిలీవ్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం లాంచనమే. శ్రీలక్ష్మికి 2026 వరకు సర్వీస్ ఉంది.