అద్భుతమైన విజువల్స్ తో…. ‘సై రా’ మేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిర్మిస్తోన్న ‘సై రా నరసింహ రెడ్డి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా వంటి సార్లు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు.

చాలా రోజుల క్రితం ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసిన దర్శక నిర్మాతలు…. గత కొంతకాలంగా ఆ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులకు చిత్ర బృందం ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది.

MAKING OF SYE RAA NARASIMHA REDDY

Here’s a glimpse of what went on behind the scenes of a project that will forever be close to our heart! #SyeRaaMaking #SyeRaaNarasimhaReddy #MegastarChiranjeevi, Amitabh Bachchan, Director Surender Reddy, #Nayanathara, #KicchaSudeep, Vijay Sethupathi, Jaggu Bhai, #RaviKishan, Tamannaah, Niharika Konidela, Amit Trivedi, Randy Rathnavelu DOP, Konidela Production Company

Posted by Ram Charan on Wednesday, 14 August 2019

చిరంజీవి పుట్టినరోజు కి కొన్ని రోజుల ముందుగానే ఇవాళ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ వీడియోలో సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి కొన్ని స్టిల్స్ మరియు వీడియోలను చూపించారు. సినిమాలో విజువల్స్ , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి పోరాట సన్నివేశం… అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు.