Telugu Global
NEWS

అనుభవం కాదు... కామన్సెన్స్ ఉండాలి

పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వల్ల అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయని, గత ప్రభుత్వం సరైన అంచనాలతో ఈ కాపర్ డ్యాం ను కట్టినట్లయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆంధ్ర ప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కాపర్ డ్యాం వల్ల మునిగిన గ్రామాల ప్రజలు గతంలో ఇంతకంటే పెద్ద వరదలనే చూశామని, ఎప్పుడూ ఇలా ముంపుకు గురి కాలేదని అంటున్నారని, గతంలో ఏడవ ప్రమాద హెచ్చరికను జారీ […]

అనుభవం కాదు... కామన్సెన్స్ ఉండాలి
X

పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వల్ల అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయని, గత ప్రభుత్వం సరైన అంచనాలతో ఈ కాపర్ డ్యాం ను కట్టినట్లయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆంధ్ర ప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

కాపర్ డ్యాం వల్ల మునిగిన గ్రామాల ప్రజలు గతంలో ఇంతకంటే పెద్ద వరదలనే చూశామని, ఎప్పుడూ ఇలా ముంపుకు గురి కాలేదని అంటున్నారని, గతంలో ఏడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినప్పుడు కూడా ఇంతటి ముంపు లేదని…. ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికకే భారీ ఎత్తున వచ్చిన వరద నీటిలో మునిగి పోతున్నామని వాళ్ళు అంటున్నారని ఆయన ఓ టీ వీ ఛానల్ తో మాట్లాడుతూ అన్నారు.

అధికారులు, కలెక్టర్లతో సహా అందరూ గత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని… అయినా వాటిని పట్టించుకోకుండా కాపర్ డ్యాం కట్టి… ఇప్పుడు ప్రజలను మేమేదో ఇబ్బందుల్లో పడేసినట్లు టీడీపీ ప్రచారం చేయడం ఏమిటని…. మండిపడ్డారు.

” మేం వచ్చి రెండు నెలలు అయింది. రెండు నెలల్లో 30 వేల మందిని తరలించి, వాళ్లకు ఇళ్లు నిర్మించడం సాధ్యమయ్యే పనేనా. ఈ పనేదో ఆయన ఎందుకు చేయలేకపోయారు. మేం స్పష్టంగా చెప్తున్నాం. నిరాశ్రయులైన ఆ ఇరవై తొమ్మిది వేల మందికి గృహాలు నిర్మించి ఇస్తాం. మాకు అనుభవం లేదని అంటున్నారు. ఇక్కడ అనుభవం కన్నా కామన్ సెన్స్ అవసరం. అంత అనుభవం ఉన్న ఆయనకు కనీసం కామన్ సెన్స్ ఎందుకు లేదో అర్థం కావడం లేదు” అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు అనిల్ కుమార్ యాదవ్.

చంద్రబాబు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏదో మాట్లాడుతూ మమ్మల్ని మేధావులు అంటూ ఎక్కిరిస్తున్నారని… ”మేం మేధావులం కాదు గాని ఆయన మేధావే కదా…. కాపర్ డ్యాం కట్టి గ్రావిటీ వాటర్ ని ఇవ్వాలనుకున్నారు కదా…. అలా ఇవ్వగలిగినప్పుడు ఇక ప్రధానమైన డ్యాం ఎందుకు?” అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

First Published:  13 Aug 2019 8:55 PM GMT
Next Story