నాగార్జున, త్రివిక్రమ్ ల మధ్య గొడవ…. సమంత పరిష్కరిస్తుందా?

గత కొంతకాలంగా నాగార్జున, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఒక విషయం మీద గొడవ జరుగుతుందన్న వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే నాగార్జున ‘మన్మధుడు’ సినిమా సక్సెస్ క్రెడిట్ త్రివిక్రమ్ కి ఇవ్వటం లేదు. ఇది మాత్రమే కాకుండా ఏకంగా త్రివిక్రమ్ డైలాగులు ఔట్ డేటెడ్ అయిపోయాయి అన్నట్టు ఇండైరెక్ట్ కామెంట్లు కూడా చేస్తున్నాడు నాగ్.

ఈ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నాగార్జున పై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంత ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికి నాగార్జున ఇలా పబ్లిక్ గా కామెంట్స్ చేయడం ఏమాత్రం సబబు కాదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఇంతకుముందు అఖిల్ అక్కినేని తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు…. కానీ ఇప్పుడు నాగార్జున చేసిన కామెంట్స్ తో అఖిల్ తో సినిమాని త్రివిక్రమ్ పూర్తిగా పక్కన పెట్టాడు.

అయితే ఈ విషయంలో కొందరు అక్కినేని కోడలు సమంతని సంప్రదించారట. నాగార్జున, త్రివిక్రమ్ ల మధ్య గొడవ పరిష్కరించమని చెబుతున్నారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత ఇప్పటికే నటించింది. ఆ చనువుతోనే ఇప్పుడు త్రివిక్రమ్, నాగార్జున మధ్య గొడవను సాల్వ్ చేయాలని అనుకుంటుందట. మరి తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.