నవరత్నాల టోల్ ఫ్రీ నెంబర్‌ 1902

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల పథకాల అమలుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పథకాలు అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఎదురైనా 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు చేయవచ్చు.

ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ కేటాయించింది. టోల్ ఫ్రీ నెంబర్‌ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను కేంద్రం ఆదేశించింది.

సీఎం కార్యాలయం పర్యవేక్షణలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయనుంది. దీన్ని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, అందుబాటులోకి తీసుకురానుంది.