Telugu Global
NEWS

ఏపీలో 5 క్యాన్సర్ ఆసుపత్రులు.... రెండు కిడ్నీ ఆసుపత్రులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల క్యాన్సర్ ఆసుపత్రులు, రెండు జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. క్యాన్సర్ ఆసుపత్రులను…. విశాఖపట్నం, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు నగరాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కిడ్నీ సంబంధిత వ్యాధుల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం […]

ఏపీలో 5 క్యాన్సర్ ఆసుపత్రులు.... రెండు కిడ్నీ ఆసుపత్రులు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల క్యాన్సర్ ఆసుపత్రులు, రెండు జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ ఆసుపత్రులను…. విశాఖపట్నం, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు నగరాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కిడ్నీ సంబంధిత వ్యాధుల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రుల శంకుస్ధాపనను అక్టోబర్ నెలలో చేపట్టాలని సీఎం చెప్పారు.

మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇక నుంచి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లోని ఆసుప్రతులలోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆసుపత్రులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

విశాఖపట్నం జిల్లా పాడేరు, విజయనగరం, గురజాలల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇక ఆరోగ్యశ్రీ పథకంలో రెండు వేలకు పైగా వ్యాధులను కొత్తగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికి ఆరోగ్య శ్రీ వర్తింపచేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారందరికీ హెల్త్ కార్డులతో పాటు క్యూఆర్ కార్డులను కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక రాష్ట్ర్రంలో కోటిన్నర మందికి ఆర్యోగ్య శ్రీ వర్తించేలా చూడాలని, వెయ్యి రూపాయల బిల్లు దాటిన వారంతా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను కోరారు.

ఇక ప్రభుత్వ సేవలైన 104, 108 వాహనాలు ఎప్పుడూ కండీషన్ లో ఉండేలా చూడాలని, కొత్తగా 1000 వాహనాలు కొనుగోలు చేస్తున్నామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వివరించారు. ప్రతీ వాహనాన్ని ఆరేళ్లకు ఒకసారి మార్చాలని, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులపై తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు.

First Published:  13 Aug 2019 8:20 PM GMT
Next Story