టీడీపీకి హ్యాండిచ్చిన రేవతి చౌదరి

టీడీపీ అధికార ప్రతినిధి రేవతి చౌదరి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చిత్రపరిశ్రమలో నిలదొక్కునేందుకు ప్రయత్నించిన రేవతి చౌదరి ఆ ప్రయత్నంలో పెద్దగా విజయవంతం కాలేదు. తమిళచిత్ర పరిశ్రమలోనూ ప్రయత్నించారు. గతేడాది అక్టోబర్‌లో టీడీపీలో చేరారు.

టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆమె ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిని ఆమె కలిశారు. ఈనెల 18న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా తాను బీజేపీలో చేరుతున్నట్టు ఆమె వెల్లడించారు.

టీడీపీకి మనుగడ లేదన్న ఉద్దేశంతోనే ఆమె బీజేపీలో చేరుతున్నట్టు చెబుతున్నారు.