రౌడీ బేబీ ఖాతాలోకి 600 మిలియన్లు

ధనుష్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం మారి 2. ఈ సినిమా విజయం సాధించలేదు కానీ ఈ సినిమా లో ని రౌడీ బేబీ పాట కి మాత్రం విశేష స్పందన వచ్చింది. ఈ పాట ఎంతోమందిని ఉర్రూతలూగించింది.ఈ పాట స్పెషాలిటీ సాయి పల్లవి చేసిన డాన్స్ అని చెప్పుకోవచ్చు.

ఇప్పటి వరకు సౌత్ ఇండియా లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న పాట ఇదే. ప్రస్తుతం ఈ పాట 600 మిల్లియన్ వ్యూస్ ని దాటి అందరినీ ఎంతగానో సంతోష పరుస్తుంది. ఈ పాట తర్వాత ఉన్న పాట ఫిదా సినిమాలోని ”వచ్చిందే…” అది కూడా సాయి పల్లవి పాటే.

సాయి పల్లవి డాన్స్ కి ఫిదా కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే సాయి పల్లవి రౌడీ బేబీ పాట లో కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది అందరినీ.

ఫిదా సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తక్కువ కాలం లో నే తెలుగు మరియు తమిళ భాషల్లో కొన్ని మంచి చిత్రాలని సంపాదించుకుంది. ధనుష్ కూడా సాయి పల్లవి కి ఏ మాత్రం తీసిపోకుండా డాన్స్ చేసి రౌడీ బేబీ కి మరింత ఆకర్షణ వచ్చేలా చేసాడు.