సాహో ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలివే!

బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది సాహో. ఈ రెండు సినిమాలు ప్రభాస్ వే కావడం విశేషం. బాహుబలి-2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తే..అంతకంటే కాస్త ఎక్కువగానే సాహో బిజినెస్ జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సినిమా 1500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంత మొత్తాన్ని సాహో బ్రేక్ చేస్తుందా అనేది డౌట్.

మరోవైపు బాలీవుడ్ రికార్డుల్ని మాత్రం సాహో తిరగరాస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బాహుబలి-2. ఇప్పుడు రికార్డును సాహో క్రాస్ చేస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రాంతాల వారీగా చేసిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు చూద్దాం.

నైజాం – రూ. 41 కోట్లు
సీడెడ్ – రూ. 21 కోట్ల 50 లక్షలు
కృష్ణా – రూ. 8 కోట్ల 20 లక్షలు
గుంటూరు – రూ. 12 కోట్ల 50 లక్షలు
నెల్లూరు – రూ. 4 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ + వెస్ట్ – రూ. 19 కోట్ల 30 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 కోట్ల 20 లక్షలు