బీజేపీలోకి పక్క పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు

బీజేపీ దేశవ్యాప్తంగా బలపడడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పక్క పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ఏమాత్రం మొహమాట పడడం లేదు. సిక్కింలో అదే పని చేసింది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకుంది.

ఇటీవల ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 17 సీట్లను ఎస్‌కేఎం గెలుచుకుంది. చామ్లింగ్‌ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 13కు చేరింది. ఇప్పుడు ఆ 13 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకుంది.

ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ… ఇలా పక్క పార్టీ నుంచి 10 మందిని తీసుకోవడం ద్వారా అసెంబ్లీలో బలమైన పార్టీగా అవతరించింది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. ఈ ఫిరాయింపులకు బీజేపీ నేత రాంమాధవ్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు.