Telugu Global
NEWS

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం సిద్ధం

జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం అంతర్గత సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జమ్ము కశ్మీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై చర్చ జరిగింది. కేంద్ర హోంశాఖ నుంచి లాంచన ప్రాయమైన విజ్ఞప్తి రాగానే సీట్ల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. త్వరలోనే నియోజక వర్గాల […]

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం సిద్ధం
X

జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం అంతర్గత సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జమ్ము కశ్మీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై చర్చ జరిగింది.

కేంద్ర హోంశాఖ నుంచి లాంచన ప్రాయమైన విజ్ఞప్తి రాగానే సీట్ల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. త్వరలోనే నియోజక వర్గాల పునర్‌విభజన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్‌ జమ్ముకశ్మీర్‌, సిక్కిం, ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు చేస్తుంది.

ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్ విభజన చట్టం ప్రకారం అక్కడ సీట్లను 107నుంచి 114కు పెంచాల్సి ఉంది. అదే విధంగా ఏపీ పునర్‌విభజన చట్టంలో కూడా నియోజక వర్గాల పెంపు అంశం ఉన్నందున ఇక్కడ కూడా సీట్ల పెంపు చేయబోతున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో సీట్లను పెంచాల్సి ఉంది. కాబట్టి కశ్మీర్‌తో పాటు ఈ మూడు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరగబోతున్నాయి. అదే జరిగితే ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది. తెలంగాణలో 119 నుంచి 153కు పెరుగుతుంది.

సీట్ల పెంపు కోసం తన హయాంలో చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నించాడు. తన హయాంలో అయితే అసెంబ్లీ సెగ్మెంట్లను టీడీపీకి అనుకూలంగా చీల్చడం వంటివి చేయవచ్చని భావించారన్న విమర్శలు ఉన్నాయి. కానీ అప్పట్లో కేంద్రం సహకరించలేదు.

First Published:  14 Aug 2019 12:59 AM GMT
Next Story